ఆ సినిమా ఓవరాల్ కలెక్షన్లను ఒక్కరోజులోనే దాటేసిన Pushpa.. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు..!

ABN , First Publish Date - 2021-12-18T23:06:46+05:30 IST

టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప- ది రైజ్' మూవీకి మిక్సడ్ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం తగ్గేదే లే అన్నట్టు దూసుకెళ్తోంది.

ఆ సినిమా ఓవరాల్ కలెక్షన్లను ఒక్కరోజులోనే దాటేసిన Pushpa.. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు..!

ఎన్నారై డెస్క్: టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప- ది రైజ్' మూవీకి మిక్సడ్ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం తగ్గేదే లే అన్నట్టు దూసుకెళ్తోంది. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. అందులోనూ అమెరికాలో అయితే 'పుష్ప' ఏకంగా 850వేల డాలర్లు(రూ.6.46కోట్లు) కలెక్ట్ చేసింది. ప్రీమియర్ షోల ద్వారా 530వేల డాలర్లు(రూ.4కోట్లు) వస్తే, తొలి రోజు మరో 320వేల డాలర్లు(రూ.2.43కోట్లు) కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్పటివరకు మొత్తంగా రూ.6.46కోట్లు రాబట్టింది. దీంతో యూఎస్‌లో అల్లు అర్జున్ టాప్-5 గ్రాసర్స్‌లో ఒక్కటైన 'సరైనోడు' ఓవరాల్ కలెక్షన్లను(రూ.6.68కోట్లు) దాదాపు ఒక్కరోజులోనే పుష్ప దాటేసినట్లైంది. దీంతో పుష్పరాజ్ ఖాతాలో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మరో రికార్డు చేరింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా సుమారు రూ.71కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ మూవీ మొత్తం రన్‌టైమ్‌లో భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప.. తొలిరోజు ఒక్క హిందీలో తప్పిస్తే మిగతా అన్ని భాషల్లో బాగానే రాబట్టింది. 


ఇక ‘పుష్ప’ ఓవర్సీస్ రైట్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ వారు రూ.14 కోట్లకు అమ్మినట్లు సమాచారం. వీటిలో కేవలం అమెరికా ద్వారానే రూ.10కోట్ల మేర వచ్చాయని తెలుస్తోంది. కనుక యూఎస్‌లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మిగతా రన్‌టైమ్‌లో మరో మూడున్నర కోట్లు సాధిస్తే సరిపోతుంది. అమెరికాలో హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సుమారు 389 స్క్రీన్స్‌లో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేశాయి.   ఇక పుష్పకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ మొత్తాన్ని చాలా తక్కువ వ్యవధిలోనే చేరుకోవడం ఖాయమని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అంతేగాక ఓవర్సీస్‌లో కలెక్షన్ల పరంగాను పలు రికార్డులు సాధిస్తుందని సినీ అభిమానులు చెబుతున్న మాట. 

Updated Date - 2021-12-18T23:06:46+05:30 IST