-
-
Home » NRI » Overseas Cinema » Mahatma Gandhi Documentary Wins Top Award at 2021 New York Indian Film Festival
-
మహాత్మా గాంధీ డాక్యుమెంటరీకి ప్రతిష్ఠాత్మక అవార్డ్!
ABN , First Publish Date - 2021-06-20T19:59:38+05:30 IST
న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో జాతిపిత మహాత్మా గాంధీపై రూపొందిన ఓ డాక్యుమెంటరీ టాప్ అవార్డును సొంతం చేసుకుంది.

న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో జాతిపిత మహాత్మా గాంధీపై రూపొందిన ఓ డాక్యుమెంటరీ టాప్ అవార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనంత్ సింగ్ నిర్మించిన 'అహింసా-గాంధీ: ద పవర్ ఆఫ్ పవర్‌లెస్' అనే డాక్యూమెంటరీ.. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో 'ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డు' గెలుచుకుంది. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ డాక్యుమెంటరీని సింగ్ నిర్మాణ సంస్థ వీడియో విజన్ నిర్మించగా, రమేష్ శర్మ రచన, దర్శకత్వం వహించారు. కాగా, మహమ్మారి కారణంగా ఈ డాక్యుమెంటరీ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
"ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డు దక్కడం చాలా గర్వంగా ఉంది. మాకు ఈ అవార్డు గాంధీ బోధనల ప్రాముఖ్యతను, ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్య్ర సంగ్రామాలపై ఆయన ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఇదే విషయంపై మా చిత్రం రూపుదిద్దుకుంది. మా చిత్రం ద్వారా గాంధీ వారసత్వాన్ని శాశ్వతం చేయడం ఆనందంగా ఉంది" అని చిత్ర దర్శకుడు రమేష్ శర్మ అన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో రమేష్ శర్మతో కలిసి పని చేయడం, మా కృషికి తగిన ఫలితం దక్కడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత అనంత్ సింగ్ పేర్కొన్నారు.