అమెరికాలో దుమ్ముదులుపుతున్న జాతిరత్నాలు

ABN , First Publish Date - 2021-03-27T06:26:31+05:30 IST

సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు

అమెరికాలో దుమ్ముదులుపుతున్న జాతిరత్నాలు

ఇంటర్నెట్ డెస్క్: సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించుకోరు. జాతిరత్నాలు చిత్రంతో ఈ విషయం మరోసారి రుజువైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన జాతిరత్నాలు చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రం దుమ్ముదులుపుతోంది. అమెరికాలో జాతిరత్నాలు చిత్రం ఏకంగా మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. లాక్‌డౌన్ తర్వాత అమెరికాలో విడుదలైన భారతీయ చిత్రాల్లో మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధించిన మొట్టమొదటి చిత్రం జాతిరత్నాలే అవ్వడం విశేషం. అమెరికాలో మార్చి 20 వరకు జాతిరత్నాలు చిత్రం 10,01,825 డాలర్ల(రూ. 7.26 కోట్లు)ను సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి అమెరికా వెళ్లి మరీ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం సినిమాకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది.

Read more