బే ఏరియాలో 'అఖండ' ఫీవర్.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా

ABN , First Publish Date - 2021-12-03T14:21:27+05:30 IST

మాస్ కా బాప్ నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబోలో తెరకెక్కిన 'అఖండ' మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ అయింది.

బే ఏరియాలో 'అఖండ' ఫీవర్.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా

మాస్ కా బాప్ నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబోలో తెరకెక్కిన 'అఖండ' మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ అయింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ హిట్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ దక్కిందని తీన్ మార్ డ్యాన్స్ చేస్తున్నారు.


ఇక, అమెరికాలోని బే ఏరియాలో 'అఖండ' ఫివర్ వైరల్‌గా మారింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అఖండకు అక్కడి ఎన్నారైలు బ్రహ్మరథం పట్టారు. బాలయ్య అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. చాలా కాలం తర్వాత బాలయ్య మంచి మాస్ హిట్ అందుకున్నారని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖండ ఇచ్చిన కిక్‌తో అక్కడి బాలయ్య అభిమానులు, ఎన్నారైలు బే ఏరియాలో సంబరాల్లో మునిగిపోయారు. బాలయ్య అభిమానులు చందు మల్లెల, శ్రీకాంత్ దొడ్డపనేని, గంగా కోమటి, లక్ష్మన్ పరుచూరి, సాయి కంభంపాటి, అజయ్ యార్లగడ్డ, అర్జున్ ఆరికట్ల, అరవింద్, మధు కండేపి, సతీష్ బొల్లా, ప్రకాష్, సత్య నారాయణ  తిపిర్నేని, వెలగపూడి బ్రదర్స్ ఆధ్వర్యంలో అఖండ సంబరాలు అంబరాన్నంటాయి. 108 కొబ్బరికాయలు కొట్టి బాలయ్య కటౌట్‌కు పాలాభిషేకం చేశారు.


మాస్ ఎలిమెంట్స్‌తో ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా బోయపాటి ఈ సినిమాను మలిచారు. మాస్ కా బాప్ బాలయ్య ఎప్పటిలాగే తన నట విశ్వరూపం చూపించి హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఇరగదీశాడు. బాలకృష్ణ అఘోరా పాత్ర సినిమాకే హైలైట్ అని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ డైలాగ్స్‌కు బోయపాటి ఎలివేషన్... కలిపి థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలేనట. చిన్నారులు, దేవాల‌యాలు, దేవుడు, ప్రకృతి త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ బోయపాటి మరోసారి హిట్ కొట్టాడు.Read more