వామ్మో.. Pooja Hegde కు ఇన్ని కోట్ల ఆస్తి ఉందా..? ఆమె నెల సంపాదన ఎంతో తెలుసా..?

ABN , First Publish Date - 2021-10-14T23:45:37+05:30 IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఫుల్ జోష్‌లో ఉన్న నటి పూజా హెగ్డే. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది.

వామ్మో.. Pooja Hegde కు ఇన్ని కోట్ల ఆస్తి ఉందా..? ఆమె నెల సంపాదన ఎంతో తెలుసా..?

Tap for Next

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఫుల్ జోష్‌లో ఉన్న నటి పూజా హెగ్డే. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది.


ఆమె డేట్స్ ఇస్తానంటే నిర్మాతలు ఎంత పారితోషికం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న నటి ఎంత సంపాదిస్తుందో అనే ఆసక్తి అందరిలోను ఉంటుంది. 


ఆమె ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ.2.5 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల టాక్. దక్షిణాది చిత్ర సీమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి పూజనే అట.


ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో సముద్ర తీరం సమీపంలో ఆమెకు 3 పడక గదుల అపార్ట్ మెంట్ ఉంది. ఆ అపార్ట్ మెంట్ విలువ కోట్లల్లోనే ఉంటుంది.


ఆమెకు దాదాపుగా రూ.51 కోట్ల ఆస్తి ఉందని మీడియా వర్గాలు వివరిస్తున్నాయి. 


సినిమాల్లో హీరోయిన్‌గా కాకుండా, యాడ్ షూట్‌లలో నటించడం ద్వారా ఆమె నెలకు దాదాపుగా రూ.50లక్షలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.


స్వతహాగా ఆమెది వ్యాపార కుటుంబం కావడం గమనార్హం. బిజినెస్ అంశాలపై కూడా ఆమెకు మంచి పట్టు ఉందట. 


కాగా, పూజ హెగ్డే నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా మూవీగా ఆ చిత్రం తెరకెక్కింది. 


ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్రలో ఆమె కనిపించనుంది. ఆ మూవీకి రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. 


టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించాయి. వంశీ, ప్రమోద్, బూషణ్ కుమార్, ప్రసీధ తదితరులు ఆ మూవీకీ నిర్మాతలుగా వ్యవహరించారు. 

Updated Date - 2021-10-14T23:45:37+05:30 IST