అమెరికాలో Pushpa కలెక్షన్ల సునామీ.. ఆ రెండు చిత్రాల ఓవరాల్ కలెక్షన్లను దాటేసే అవకాశం!

ABN , First Publish Date - 2021-12-19T16:29:47+05:30 IST

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప'కు మిక్సడ్ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది.

అమెరికాలో Pushpa కలెక్షన్ల సునామీ.. ఆ రెండు చిత్రాల ఓవరాల్ కలెక్షన్లను దాటేసే అవకాశం!

ఎన్నారై డెస్క్: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప'కు మిక్సడ్ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.71కోట్లు(గ్రాస్) సాధించిందీ సినిమా. అటు అమెరికా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అక్కడ ప్రీమియర్స్, తొలిరోజు కలెక్షన్లు కలుపుకుని ఏకంగా 8 లక్షల 50వేల డాలర్లు(రూ.6.46కోట్లు) కలెక్ట్ చేసింది. రెండో రోజు(శనివారం) సాయంత్రం 6.30 గంటల షో వరకు 330 లోకేషన్స్‌లో 3లక్షల 24వేల డాలర్లు(రూ.2.59కోట్లు) వచ్చాయి. దాంతో ఇప్పటివరకు యూఎస్‌లో పుష్ప మొత్తం కలెక్షన్లు 1.30 మిలియన్ డాలర్లకు(రూ.9.88కోట్లు) చేరాయి. కాగా, రన్‌టైమ్ మొత్తంలో 'పుష్ప' మరో రెండు చిత్రాల వసూళ్లను కూడా దాటేసే అవకాశం ఉంది. అలా జరిగితే సుక్కు, ఐకాన్ స్టార్ ఖాతాల్లో మరో రెండు కొత్త రికార్డులు చేరుతాయి. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు ఇలాగే స్టడీగా కొనసాగితే బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'అలా వైకుంఠపురంలో', రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్‌లోని బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' చిత్రాలను వెనక్కి నెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 'అలా వైకుంఠపురంలో' మూవీ అమెరికాలో మొత్తం రన్‌టైమ్‌లో 3.63 మిలియన్ డాలర్లు(రూ.27.59కోట్లు) కొల్లగొట్టింది. ఇదే బన్నీ కెరీర్‌లో యూఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం. దీంతో భారతీయ చిత్రాలు అమెరికాలో సాధించిన అత్యధిక వసూళ్ల జాబితాలో ఈ సినిమా మూడో స్థానంలో ఉంది. 


ఆ తర్వాత నాలుగో స్థానంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుక్కు కాంబోలో వచ్చిన 'రంగస్థలం' ఉంది. ఈ చిత్రం అమెరికాలో మొత్తం 3.51 మిలియన్ డాలర్లు(రూ.26.68కోట్లు) రాబట్టింది. ఇప్పుడు సుక్కు, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' కలెక్షన్లు 'అలా వైకుంఠపురంలో', 'రంగస్థలం' మూవీలను దాటేస్తే.. ఒకేసారి వారిద్దరి ఖాతాల్లో కొత్త రికార్డులు చేరుతాయి. ఇక అమెరికాలో అల్లు అర్జున్ టాప్-5 గ్రాసర్స్‌ విషయానికి వస్తే... 1. 'అలా వైకుంఠపురంలో' (రూ.27.59కోట్లు), 2. 'రేసుగుర్రం'(రూ.10.56కోట్లు), 3. 'సన్నాఫ్ సత్యమూర్తి'(రూ.9.65కోట్లు), 4. 'దువ్వాడ జగన్నాథం'(రూ.8.47కోట్లు), 5. 'సరైనోడు'(రూ.6.68కోట్లు).   

Updated Date - 2021-12-19T16:29:47+05:30 IST