అక్టోబర్‌లో ‘అలా అమెరికాపురములో..’.. స్టార్ డైరెక్టర్ తమన్ సార్థ్యంలో స్పెషల్ ఈవెంట్

ABN , First Publish Date - 2021-09-13T03:15:27+05:30 IST

ఈ దీపావ‌ళికి త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో అమెరికాలో ఆహా సమర్పించు 'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు చేసింది. ఈ మ్యూజిక‌ల్ కార్నివాల్‌లో..

అక్టోబర్‌లో ‘అలా అమెరికాపురములో..’.. స్టార్ డైరెక్టర్ తమన్ సార్థ్యంలో స్పెషల్ ఈవెంట్

ఈ దీపావ‌ళికి త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో అమెరికాలో ఆహా సమర్పించు 'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు చేసింది. ఈ మ్యూజిక‌ల్ కార్నివాల్‌లో అద్భుత ప్రదర్శన కోసం టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ త‌మ‌న్‌ను అమెరికా పయనమయ్యారు. అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ నెల‌ల‌లో వాషింగ్టన్ డీసీ, చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్, డల్లాస్‌లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. శివమణి, నవీన్, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, సిద్ధాంత్‌, ష‌దాబ్ రాయిన్ వంటి టాలెంటెడ్ సింగర్స్, మ్యుజీషియన్స్ తమన్ సంగీత బృందంలో ఉన్నారు. 


దీపావ‌ళి రోజున జ‌రిగే ఈ కాన్సర్ట్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మరియు స్టార్ హీరో ముఖ్య అతిధులు గా హాజరు కానున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్లు, ఇతర ప్రముఖ ప్రముఖులు తమన్‌తో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని సంగీతాభిమానుల‌కు ది బెస్ట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియ‌న్స్ అందించడానికి భారీ స్టేజ్ ప్రొడక్షన్‌తో పాటలు, నృత్యాలు, స్కిట్‌లు, విజువల్ ట్రీట్‌లతో పూర్తిస్థాయిలో వినోదం ఉండేలా ఈవెంట్స్ ప్లాన్ చేశారు నిర్వాహకులు.


మ్యూజిక్ కాన్సర్ట్ డేట్స్:

Dallas, TX - October 30,2021  

New Jersey - November 5,2021

Washington DC - November 7,2021

San Jose, CA - November 26,2021

Updated Date - 2021-09-13T03:15:27+05:30 IST