ప్రవాసులకు Kuwait గుడ్‌న్యూస్.. ఆ సర్వీస్ మళ్లీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-30T13:38:04+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

ప్రవాసులకు Kuwait గుడ్‌న్యూస్.. ఆ సర్వీస్ మళ్లీ ప్రారంభం

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొన్ని వారాలుగా వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యువల్ నిలిపివేసిన కువైత్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తిరిగి ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉదయం కీలక ప్రకటన చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ విభాగం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రవాసులు ఆన్‌లైన్ విధానంలో తమ డ్రైవింగ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవచ్చని వెల్లడించింది. గడువు తీరు తేదీ కంటే 6నెలల ముందే ఇలా ఆన్‌లైన్ ద్వారా వలసదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌లను పునరుద్ధరించుకునే వెసులుబాటు కల్పించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి.. అక్కడ కావాల్సిన వివరాలను సమర్పించడం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యువల్ అవుతోంది. 


ఇదిలాఉంటే.. గత కొంతకాలంగా ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్‌ల విషయమై కువైత్ మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. దేశంలో రోజురోజుకు ట్రాఫిక్ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్‌ జారీని ఆపివేయాలనే ఆలోచన చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కువైత్ వెనక్కి తగ్గింది. దీనిలో భాగంగానే తాజాగా ఆన్‌లైన్ విధానంలో ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యువల్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు వలసదారులకు భారీ సంఖ్యలో వాహనాలు ఉండకుండా కఠిన నిబంధనలు తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ప్రవాసులకు వ్యక్తిగత అవసరాలకు ఒక్కొక్కరికి కేవలం రెండు కార్లు మాత్రమే ఉండాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.   

Updated Date - 2021-12-30T13:38:04+05:30 IST