అమెరికాలో ద్వేషానికి తావులే దు.. ట్వీట్ చేసిన బైడెన్

ABN , First Publish Date - 2021-05-21T05:26:37+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనప్పటి నుంచి అగ్రరాజ్యం అమెరికాలో ఆసియన్లపై విద్వేష దాడులు పెరిగిపోతున్నాయి.

అమెరికాలో ద్వేషానికి తావులే దు.. ట్వీట్ చేసిన బైడెన్

వాషింగ్టన్: కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనప్పటి నుంచి అగ్రరాజ్యం అమెరికాలో ఆసియన్లపై విద్వేష దాడులు పెరిగిపోతున్నాయి. కరోనాను చైనా వైరస్ అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసి ప్రచారం కూడా ఈ అగ్నికి ఆజ్యంపోసింది. దీంతో ఆసియా దేశాల ప్రజలపై అమెరికాలో దాడుల సంఖ్య ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఈ క్రమంలో అమెరికాలో ఆసియన్లపై విద్వేష నేరాలకు పాల్పడకుండా చట్టం తెచ్చేందుకు బైడెన్ సర్కారు సిద్ధమైంది. దీని గురించి ట్వీట్ చేసిన బైడెన్.. ‘‘అమెరికాలో ద్వేషానికి తావులేదు. కొవిడ్-19 హేట్ క్రైమ్ యాక్ట్‌పై సంతకం చేయడం ద్వారా ఈ విషయాన్ని మరింత స్పష్టం చేయడం కోసం ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ బిల్లును న్యాయశాఖకు చెందిన ఒక ఉద్యోగి పరిశీలించాల్సిన  అవసరం ఉంది.

Updated Date - 2021-05-21T05:26:37+05:30 IST