హెచ్4 ఈఏడీపై నిరంజన్ శృంగవరపు కీలక వ్యాఖ్యలు!
ABN , First Publish Date - 2021-03-21T23:58:00+05:30 IST
హెచ్4 ఈఏడీ గడువు ముగిసిన తర్వాత దాన్ని రెన్యూవల్ చేసుకునేందుకు నిర్ణీత కాల వ్యవధి లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిరంజన్ శృంగవరపు అన్నారు. గ్రీన్‌కార్డ్ ఈఏడీకి ఉన్నట్టుగానే

వాషింగ్టన్: హెచ్4 ఈఏడీ గడువు ముగిసిన తర్వాత దాన్ని రెన్యూవల్ చేసుకునేందుకు నిర్ణీత కాల వ్యవధి లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిరంజన్ శృంగవరపు అన్నారు. గ్రీన్‌కార్డ్ ఈఏడీకి ఉన్నట్టుగానే 180 రోజుల వెసులుబాటును హెచ్4 ఈఏడీకి కూడా కల్పించాలని కోరారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు, న్యాయ నిపుణులు పాల్గొన్న ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ సమస్య వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యాపారాలు స్థాపించిన వారు కూడా తమ వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ సమస్యను మరికొంత మంది కాంగ్రెస్ సభ్యులు, న్యాయనిపుణుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. గ్రీన్‌కార్డు ఈఏడీకి ఉన్నట్టుగా 180 రోజుల వెసులుబాటును హెచ్4 ఈఏడీకి కూడా కల్పించడం ద్వారా చాలా మంది భారతీయులు లబ్ధి పొందుతారని అభిప్రాయపడ్డారు. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి హెచ్4 వీసాలు ఉపయోగపడుతాయి. కాగా.. నిరంజన్ శృంగవరపు తానా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.