తడబడ్డ టీవీ యాంకర్.. పోప్ ఇకలేరని..ఆ వెంటనే..

ABN , First Publish Date - 2021-12-27T00:47:50+05:30 IST

క్రిస్మస్ పర్వదినానా..క్రైస్తవులందరూ పోప్ ప్రసంగం, ఆయనిచ్చే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఐటీవీ ఛానల్‌కు చెందిన యాంకర్ అనూహ్య తప్పిదానికి పాల్పడింది.

తడబడ్డ టీవీ యాంకర్.. పోప్ ఇకలేరని..ఆ వెంటనే..

ఇంటర్నెట్ డెస్క్: క్రిస్మస్ పర్వదినానా..క్రైస్తవులందరూ పోప్ ప్రసంగం, ఆయనిచ్చే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఐటీవీ ఛానల్‌కు చెందిన యాంకర్ అనూహ్య తప్పిదానికి పాల్పడింది. పోప్ ప్రస్తావన తెస్తూ అనూహ్యంగా ఆయన మరణవార్తను కూడా ప్రకటించింది. కరోనా సంక్షోభం సమసిపోయేందుకు పోప్ ప్రార్థనలు చేశారన్న ఆమె ఆ తరువాత అకస్మాత్తుగా..‘ఆయన మరణం..’ అంటూ తడబడింది. ఆ తరువాత యాంకర్ తన తప్పును సరిదిద్దుకున్నప్పటికీ జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈ తడబాటుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ వెంటనే సోషల్ మీడియా బాటపట్టి విపరీతంగా వైరల్ అవుతోంది. 


ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంత పెద్ద పొరపాటు చేసాక కూడా ఆమె అసలేమాత్రం తొణకకుండా తనని తాను సంభాళించుకున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇదేమైనా నా భ్రమా లేక ఆమె నిజంగానే పోప్ మరణం అని అందా..?’ అంటూ మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘పోప్‌కు నిజంగానే ఏమైనా అయితే.. పోలీసులు ఆమె ఛానల్ తలుపు తట్టడం గ్యారెంటీ’ అంటూ ఇంకొందరు ఛలోక్తులు విసిరారు. Updated Date - 2021-12-27T00:47:50+05:30 IST