యూకేలో బయటపడ్డ కరోనా.. 50దేశాలకు పాకింది!

ABN , First Publish Date - 2021-01-14T06:15:26+05:30 IST

కొవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌లో బయటపడిన కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. యూకేలో బయటపడ్డ

యూకేలో బయటపడ్డ కరోనా.. 50దేశాలకు పాకింది!

న్యూఢిల్లీ: కొవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌లో బయటపడిన కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. యూకేలో బయటపడ్డ కరోనా వైరస్.. ఇప్పటి వరకు 50 దేశాలకు వ్యాప్తి చెందినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదే సమయంలో ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ వేరియంట్ 20దేశాలకు పాకినట్టు పేర్కొంది. కాగా.. యూకేలో గత ఏడాది డిసెంబర్ 14న బయటపడిన కరోనా వైరస్ వేరియంట్.. కొవిడ్ 19తో పోల్చితే 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే పలు నివేదికల్ల వెల్లడైన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-01-14T06:15:26+05:30 IST