చైనా నుంచి మరో షాకింగ్ వార్త.. అక్కడ మరో కొత్త కరోనా వేరియంట్!

ABN , First Publish Date - 2021-05-30T11:46:09+05:30 IST

చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. 1.5 కోట్ల మంది నివసించే ఇక్కడి గ్వాంగ్జూ నగరంలో గడచిన వారం రోజుల్లో 20 కొత్త కేసులు నమోదుకాగా..

చైనా నుంచి మరో షాకింగ్ వార్త.. అక్కడ మరో కొత్త కరోనా వేరియంట్!

బీజింగ్‌: చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. 1.5 కోట్ల మంది నివసించే ఇక్కడి గ్వాంగ్జూ నగరంలో గడచిన వారం రోజుల్లో 20 కొత్త కేసులు నమోదుకాగా.. ఇందులో గతంలో బయటపడ్డ రకాలకు భిన్నమైన వేరియంట్‌ను నిపుణులు గుర్తించారు. ఈ వేరియంట్‌ చాలా ప్రమాదకరమైనదని, అత్యంత వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. దీంతో.. అప్రమత్తమైన స్థానిక ప్రభుత్వం.. నగరంలోని ఐదు ప్రాంతాల్లో శనివారం లాక్‌డౌన్‌ విధించింది. స్కూళ్లు, వ్యాపార, వినోదాత్మక కేంద్రాలను మూసివేయాలని ఆదేశించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. ఆ ప్రాంతంలోని మొత్తం జనాభాకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు చైనాలో అక్కడక్కడ వస్తున్న కేసులు విదేశాల నుంచి వచ్చినవే. కొత్త కేసులు మాత్రం స్థానికంగా వ్యాప్తి చెందినవని గుర్తించింది.

Updated Date - 2021-05-30T11:46:09+05:30 IST