వైరల్: విమాన ప్రయాణం.. ముందు సీట్లోని మహిళ ఇలా దారుణంగా..
ABN , First Publish Date - 2021-10-25T00:12:21+05:30 IST
మనం ఎక్కడున్నా సరే.. హద్దుల్లో మెలగాలి. అవతలి వారికి ఇబ్బంది కలిగించకుండా మసలుకోవాలి. సంఘ జీవిగా మనకందరికీ ఉండాల్సిన కనీస జ్ఞానం ఇది. ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ ఫొటో చూస్తే కచ్చితంగా ఇదే విషయం గుర్తొస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: మనం ఎక్కడున్నా సరే.. హద్దుల్లో మెలగాలి. అవతలి వారికి ఇబ్బంది కలిగించకుండా మసలుకోవాలి. సంఘ జీవిగా మనకందరికీ ఉండాల్సిన కనీస జ్ఞానం ఇది. ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ ఫొటో చూస్తే కచ్చితంగా ఇదే విషయం గుర్తొస్తుంది. ఈ ఫొటోలోని మహిళ విమానంలో ప్రయాణిస్తూ అంతా తన ఇష్టారాజ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. సొంత ఇంట్లో కూర్చున్నట్టు.. తాపీగా తన శిరోజాలను సీటు వెనకాల వేసుకుని రిలాక్స్డ్గా కూర్చుంది. ఈ జుట్టు వల్ల వెనక సీట్లో ఉన్న వారు ఇబ్బంది పడతారన్న విషయాన్ని కూడా లెక్కచేయనట్టు ఉంది ఆమె తీరు. అయితే.. ఆమె వెనక కూర్చున్న వ్యక్తి మాత్రం ఆమె తీరును ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
దీంతో..నెటిజన్లు ఆమెను విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ‘‘ఇది నీ ఇల్లా లేక విమానమా.. కనీస జ్ఞానం ఉండక్కర్లేదా’’ అంటూ తిట్టిపోస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆమెపై రివెంజ్ ఎలా తీర్చుకోవాలో కూడా చెప్పారు. ‘‘మెల్లగా..చప్పుడు చేయకుండా.. ఆమె సీటు వెనకాల ఉన్న ట్రేను తెరవాలి.. జుట్టు అందులో ఇరుక్కున్నాక ట్రేను మూసేయాలి.. అప్పుడు తెలుస్తుంది ఆమెకు ఇబ్బంది అంటే ఏంటో అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూసిన నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇటువంటి అలవాటు ఉన్నవారెవరైనా సరే..ఈ ఫొటో చూశాకైనా తమ పద్ధతి మార్చుకోవాలని ఆంకాక్షించాు.