కువైట్‌లో భారీగా మూతపడ్డ గృహ కార్మికుల నియామక కార్యాలయాలు

ABN , First Publish Date - 2021-03-21T14:52:41+05:30 IST

గల్ఫ్ దేశం కువైట్‌లో గృహ కార్మికుల నియామక కార్యాలయాలు భారీగా మూతపడ్డాయి.

కువైట్‌లో భారీగా మూతపడ్డ గృహ కార్మికుల నియామక కార్యాలయాలు

కువైట్ సిటీ: గల్ఫ్ దేశం కువైట్‌లో గృహ కార్మికుల నియామక కార్యాలయాలు భారీగా మూతపడ్డాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 470 కార్యాలయాల్లో 300 వరకు మూతపడినట్లు సమాచారం. వీటిలో కొన్నింటీ లైసెన్స్ క్యాన్సిల్ అయితే, మరికొన్నెమో నిర్వహణ వ్యయం భరించలేక స్వతహాగా మూసివేసినట్లు స్థానిక మీడియా సమాచారం. ఇటీవల ఫిలిప్పైన్స్ ఎంబసీతో మీటింగ్ సందర్భంగా మొత్తం 470 నియామక ఆఫీసుల్లో కేవలం 197 కార్యాలయాలు మాత్రమే పాల్గొన్నాయట. ప్రాథమిక సమాచారం ప్రకారం 100 కార్యాలయాల లైసెన్లు రద్దు కాగా, మరో 200 ఆఫీసులు నిర్వహణ వ్యయాలు భరించలేక మూసివేసినట్లు తేలింది. ఇలా మొత్తం 300 కార్యాలయాలు మూతపడ్డాయి. కాగా, మహమ్మారి కరోనా కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో పాటు వీసాల జారీ కూడా ఆగిపోవడంతో విదేశాల నుంచి గృహ కార్మికులను తీసుకురావడం నియామక కార్యాలయాలకు సాధ్యం పడటం లేదు. ఇది కూడా భారీగా నియామక ఆఫీసులు మూతపడడానికి కారణమైంది.  

Updated Date - 2021-03-21T14:52:41+05:30 IST