మొట్టమొదటిసారి భారతీయ వంటకాన్ని రుచిచూసి.. ఈ విదేశీయుడు ఇచ్చిన రియాక్షన్ వీడియో అదుర్స్..!
ABN , First Publish Date - 2021-08-29T02:04:13+05:30 IST
భారతీయ వంటకాలకు ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటకాలకు ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. మసాల దినుసులను ప్రపంచానికి పరిచయం చేసిందే భారత్ అయితే.. వాటిని వినియోగించి చేసే మన వంటకాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మసాల దినుసుల ఘుమఘుమలతో నోరూరించడం మన వంటకాల స్పెషల్. అందుకే విదేశీయులు ఎంతో ఇష్టంగా మన వంటకాల్ని రుచిచూస్తుంటారు. ఇదే కోవలో ఇటీవల ఓ నైజీరియన్ కూడా ఇలాగే మొట్టమొదటిసారి భారతీయ వంటకాన్ని రుచిచూసి.. ఆయన ఇచ్చిన రియాక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నైజీరియాకు చెందిన టక్కారా అనే మహిళ తన భర్త లామ్‌బొగిన్నీ తొలిసారి భారత వంటకాన్ని రుచిచూస్తున్న సమయంలో ఈ వీడియో తీసింది. ఆయన బిర్యానీతో పాటు చపాతీ వంటి ఇతర వంటకాల్ని ఎంతో ఇష్టంగా తినడం ఈ వీడియోలో ఉంది. అంతేగాక తిరిగి వెళ్తున్న సమయంలో చేతిలో పార్శిల్‌తో వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. అంటే.. భారతీయ వంటకాలు లామ్‌బొగిన్నీ అంతలా ఆస్వాదాన్ని అందించాయన్నమాట. మొట్టమొదటిసారి భారతీయ వంటకాన్ని రుచిచూసి.. లామ్‌బొగిన్నీ ఇచ్చిన రియాక్షన్ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియోను టక్కారా తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా ఇప్పటివరకు 94వేలకు పైగా మంది వీక్షించారు. చాలా మంది లామ్‌బొగిన్నీ ఇచ్చిన రియాక్షన్‌పై కామెంట్ చేస్తున్నారు.