భర్తకు భారీ షాకిచ్చిన భార్య.. మూడేళ్ల పాటు అతడిని ఊరించి.. చివరకు ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2021-12-24T00:50:56+05:30 IST

అతడికి IELTSలో మంచి స్కోర్ రాలేదు. దీంతో.. వీసా రాలేదు. ఆదే పరీక్షలో మంచి మార్కులు వచ్చిన యువతిని పెళ్లాడాడు. ఆస్ట్రేలియాలో ఆమెకు చదువుకు అయ్యే ఖర్చంతా తనే భరించాడు. తన ఆశలన్నీ భార్యపైనే పెట్టుకున్నాడు. కానీ..

భర్తకు భారీ షాకిచ్చిన భార్య.. మూడేళ్ల పాటు అతడిని ఊరించి.. చివరకు ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి IELTSలో మంచి స్కోర్ రాకపోవడంతో వీసా రాలేదు. ఆదే పరీక్షలో మంచి మార్కులు వచ్చిన యువతిని పెళ్లాడాడు. ఆమె సాయంతో స్పౌస్(జీవిత భాగస్వామి) వీసాపై ఫారిన్ వెళ్లాలనేది అతడి ప్లాన్. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఆమె చదువుకు అయ్యే ఖర్చునంతా తనే భరించాడు. చేతిలో డబ్బు సరిపోకపోతే.. కొంత ఆస్తిని అమ్మిమరీ రూ. 35 లక్షలు ఆమెకిచ్చాడు. తన ఆశలన్నీ భార్యపైనే పెట్టుకున్నాడు. అసలు ఈ ఆలోచన యువతిదే. తాను ఆస్ట్రేలియా వెళ్లాక అతడికి స్పౌస్ వీసా(జీవితభాగస్వామికి ఇచ్చే వీసా) వచ్చేందుకు సహకరిస్తానని చెప్పింది. తన చదువు ఖర్చు మాత్రం భర్తే భరించాలంది. ఈ ప్రతిపాదనకు అతడు అంగీకరించాడు. ఇద్దరూ కలిసి ఫారిన్‌లో సెటిలవ్వొచ్చని కలలుగన్నాడు.  కానీ.. భార్య చివరికి అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె చేసిన మోసంతో అతడి కల కలగానే మిగిలిపోయింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..


భార్య అమన్‌జ్యోత్ తనను నమ్మించి మోసం చేసిందంటూ హర్‌ప్రీత్ సింగ్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2018లో తమకు వివాహమైందని, 2019లో ఆమె చదువు కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఆమె చదువుకయ్యే ఖర్చంతా తానే భరించానని, కానీ.. ఆమె మాత్రం తనను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లేందుకు అసలు ఏలాంటి ప్రయత్నం చేయలేదని బావురుమన్నాడు. తనకు వివాహం కాలేదని అమన్‌జ్యోత్ పేర్కొనడంతో తన వీసా దరఖాస్తులు రెండు సార్లు తిరస్కరణకు గురయ్యాయని వాపోయాడు. దీంతో..పంజాబ్ పోలీసులు అమన్‌జ్యోత్, ఆమె తల్లి, సోదరుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా.. పంజాబ్‌లో గతంలోనూ ఇటువంటి ఘటనలు వెలుగు చూశాయి. జీవిత భాగస్వామికి ఇచ్చే(స్పౌస్) వీసా వచ్చేందుకు సహాయపడతామంటూ అనేక మంది యువతులు పెళ్లిళ్లు చేసుకుని ఆ తరువాత విదేశాలకు వెళ్లాక తమ భర్తలను వదిలించుకుంటున్న ఘటనలు బయటపడ్డాయి.  

Updated Date - 2021-12-24T00:50:56+05:30 IST