ఎయిర్ పోర్టులో కలకలం.. ప్రాణ భయంతో పరుగెత్తిన జనం..లగేజీ తనిఖీ సందర్భంగా ఆ ప్యాసింజర్ చేసిన పనికి..

ABN , First Publish Date - 2021-11-22T03:38:47+05:30 IST

ప్రయాణికుడు చేసిన పనికి..ప్రాణభయంతో పరుగులు పెట్టిన తోటి ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే..

ఎయిర్ పోర్టులో కలకలం.. ప్రాణ భయంతో పరుగెత్తిన జనం..లగేజీ తనిఖీ సందర్భంగా ఆ ప్యాసింజర్ చేసిన పనికి..

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్నారు. ఇంతలో లగేజీని చెక్ చేసే ఎక్సే రే మిషన్‌ శబ్దం చేయడం ప్రారంభించింది. ఆ బ్యాగులో ఏదో నిషేధిత వస్తుంవుందని దాని అర్థం. వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారి..ఆ బ్యాగు తీసుకొచ్చిన వ్యక్తిని కాస్తంత దూరంగా జరిగి నిలబడమన్నాడు. బ్యాగును టచ్ చేయద్దన్నాడు. అతడు బ్యాగులోకి తొంగి చూడగా తుపాకీ కనిపించింది. ఇంతలో బ్యాగు తీసుకొచ్చిన వ్యక్తి అనూహ్యంగా ముందుకు పరిగెత్తి..తుపాకీని తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తుపాకీ పేలడంలో ఎయిర్‌పోర్టు‌లో పెద్ద కలకలం రేగింది. అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలోగల హార్ట్‌ఫీల్డ్ జాక్సన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో శనివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.


ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దుండగుడు ఎవరో తుపాకీతో ఎయిర్ పోర్టులో సంచరిస్తున్నాడనే వార్త క్షణాల్లో వైరల్ అయింది. దీంతో..అక్కడున్న వారందరూ భయంతో పరుగులు తీశారు. ఈ గలాటాలో ముగ్గురు వ్యక్తులు కిందపడి గాయాలపాలయ్యారు. కొద్ది సేపటి తరువాత.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తుపాకీ కలిగిన వ్యక్తి ఎవరూ ఎయిర్‌పోర్టులో లేరంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. బ్యాగులో తుపాకీతో ఎయిర్‌పోర్టుకు వచ్చిన కెన్నీ వెల్స్ అనే ప్రయాణికుడిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. తుపాకీ ఉన్న విషయాన్ని దాచిపెట్టిన నేరానికి అతడిపై కేసు నమోదైంది. నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు.

Updated Date - 2021-11-22T03:38:47+05:30 IST