ప్రవాసీ సంఘానికి ప్రతిష్టాత్మక పురస్కారం!
ABN , First Publish Date - 2021-02-01T12:59:29+05:30 IST
కొవిడ్ కష్ట కాలంలో ప్రవాస భారతీయులకు ఆసరాగా నిలిచినందుకు గల్ఫ్‌లోని ప్రవాస భారతీయుల సంఘానికి మహాత్మ అవార్డు దక్కింది. అబూధాబిలోని భారత ఎంబసీ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్(ఐఎస్‌సీ)కు బిర్లా గ్రూప్ అందించే మహాత్మ పురస్కారం లభించింది.

గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి: కొవిడ్ కష్ట కాలంలో ప్రవాస భారతీయులకు ఆసరాగా నిలిచినందుకు గల్ఫ్‌లోని ప్రవాస భారతీయుల సంఘానికి మహాత్మ అవార్డు దక్కింది. అబూధాబిలోని భారత ఎంబసీ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్(ఐఎస్‌సీ)కు బిర్లా గ్రూప్ అందించే మహాత్మ పురస్కారం లభించింది. శనివారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్స కార్యక్రమంలో ఐఎ్‌ససీ అధ్యక్షుడు యోగీశ్ ప్రభు అవార్డును అందుకున్నారు. వరంగల్‌కు చెందిన రాజ శ్రీనివాసరావు అబూధాబిలోని జాతీయ చమరు ఉత్పత్తి సంస్థ ఆద్నాక్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐఎ్‌ససీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన కరోనా కష్టకాలంలో చురుకుగా సహాయ చర్యలు చేపట్టారు. 50 వేల మందికి ఆహార పొట్లాలు, 100 మందికి విమాన టిక్కెట్లు సమకూర్చడంతో పాటు 10 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.