అమెరికాకు బ్యాడ్‌న్యూస్.. జూన్ 1 నాటికి!

ABN , First Publish Date - 2021-02-06T21:37:31+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో.. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూ

అమెరికాకు బ్యాడ్‌న్యూస్.. జూన్ 1 నాటికి!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో.. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్(ఐహెచ్ఎంఈ) అమెరికాకు ఓ చేదు వార్త చెప్పింది. అమెరికాలో కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేస్తూ ఐహెచ్ఎంఈ ఓ నివేదికను వెల్లడించింది. అందులో.. ఈ ఏడాది జూన్ 1 నాటికి అమెరికాలో రోజూవారీ కరోనా మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగి.. క్రమంగా తగ్గుముఖం పడుతుందని తెలిపింది. దీంతో అగ్రరాజ్యంలో కరోనా మృతుల సంఖ్య 6.31లక్షల వరకు చేరొచ్చని అంచనా వేసింది. పరిస్థతి మరింత దిగజారితే ఈ సంఖ్య 7లక్షలు దాటొచ్చని తెలిపింది.అయితే ఈ మరణాల సంఖ్య వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆధారపడి ఉన్నట్టు తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం ద్వారా మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాలో 77శాతం మంది మాస్క్‌లు ధరిస్తున్నట్టు ఐహెచ్ఎంఈ పేర్కొంది. 95శాతం మంది మాస్కులు ధరించేలా చేయడం ద్వారా 44వేల మంది ప్రాణాలను కాపాడొచ్చని తెలిపింది. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం అమెరికాలో గడిచిన 24 గంటల్లో సుమారు 1.26లక్షల మంది కొవిడ్ బారినపడగా.. 3500 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 2.68కోట్లు దాటింది. ఇదే సమయంలో 4.59లక్షల మరణాలు నమోదయ్యాయి. 


Updated Date - 2021-02-06T21:37:31+05:30 IST