కువైట్ ప్రయాణికులపై అదనపు భారం !

ABN , First Publish Date - 2021-02-01T14:18:23+05:30 IST

కువైట్ విమాన ప్రయాణికులపై ఇకపై ఎయిర్ పోర్టు చార్జీల రూపంలో అదనపు భారం పడనుంది.

కువైట్ ప్రయాణికులపై అదనపు భారం !

కువైట్ సిటీ: కువైట్ విమాన ప్రయాణికులపై ఇకపై ఎయిర్ పోర్టు చార్జీల రూపంలో అదనపు భారం పడనుంది. కువైట్ విమానాశ్రయం నుంచి వేరే దేశాలకు వెళ్లే ప్రయాణికులు మూడు దినార్లు, ఇతర దేశాల నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులు రెండు దినార్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని మంత్రి అబ్దుల్లా మరాఫీ వెల్లడించారు. కువైట్ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగించే ప్రవాసీలతో పాటు దేశ పౌరులకు కూడా ఈ చార్జీలు వర్తిస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) పేర్కొంది. అలాగే ఈ చార్జీలను ఎయిర్‌లైన్స్‌లు తమ విమాన టికెట్ల ధరతోనే కలిపి ప్రయాణికుల నుంచి వసూలు చేస్తాయని డీజీసీఏ వెల్లడించింది.      

Updated Date - 2021-02-01T14:18:23+05:30 IST