అత్యంత ఖరీదైన గల్ఫ్ దేశాల జాబితాలో Kuwait టాప్!

ABN , First Publish Date - 2021-12-31T12:59:35+05:30 IST

అత్యంత ఖరీదైన గల్ఫ్ దేశాల జాబితాలో కువైత్ మొదటి స్థానంలో నిలిచింది.

అత్యంత ఖరీదైన గల్ఫ్ దేశాల జాబితాలో Kuwait టాప్!

కువైత్ సిటీ: అత్యంత ఖరీదైన గల్ఫ్ దేశాల జాబితాలో కువైత్ మొదటి స్థానంలో నిలిచింది. 2011 నుండి 2020 వరకు జీవన వ్యయంలో అత్యంత ఖరీదైన గల్ఫ్ దేశంగా కువైత్ ర్యాంక్ దక్కించుకుంది. గత పదేళ్లలో ద్రవ్యోల్బణం, అధిక ధరలు, జీవన వ్యయాన్ని కొలిచే వినియోగదారుల ధరల సూచిక పెరుగుదలతో కువైత్‌కు అగ్రస్థానం దక్కింది. కరోనా మహమ్మారి పరిణామాల ఫలితంగా గత రెండేళ్లలో ఇది మరింత పెరిగిందని అక్కడి ఓ దినపత్రిక వెల్లడించింది. అయితే, అధిక జీవన వ్యయం ఉన్నప్పటికీ మిగిలిన గల్ఫ్ దేశాలతో పోలిస్తే కువైత్ ద్రవ్యోల్బణం అస్థిరత రేటులో పెద్దగా మార్పు లేదు. 


ఇక గత పదేళ్లలో ఆ దేశంలో ద్రవ్యోల్బణం సగటు పెరుగుదల 2.5 శాతంగా నమోదైంది. గల్ఫ్ ప్రాంతంలో ఇదే అత్యధిక పెరుగుదల రేటు. ఆ తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. సౌదీలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల 1.7 శాతంగా ఉంది. ఇదే కాలంలో జీవన వ్యయం పరంగా మూడో స్థానంలో బహ్రెయిన్ 1.5 శాతం.. ఆ తర్వాత వరుసగా యూఏఈ 1.2 శాతం, ఖతార్ 1.1 శాతం, ఒమన్ 1 శాతం ఉన్నాయి.

Updated Date - 2021-12-31T12:59:35+05:30 IST