Tourist visa పై కువైత్ కీలక నిర్ణయం.. జీసీసీ, 53 దేశాల వారికి మాత్రమే ఆ అవకాశం..
ABN , First Publish Date - 2021-11-25T15:54:34+05:30 IST
టూరిస్ట్ వీసా జారీ విషయమై కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
కువైత్ సిటీ: టూరిస్ట్ వీసా జారీ విషయమై కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలలోని విదేశీ నివాసులతో పాటు మరో 53 దేశాల వారికి మాత్రమే టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు భారత పౌరులకు మాత్రం అవకాశం లేదు. ఇక టూరిస్ట్ ఈ-వీసా, ఆన్లైన్ చెల్లింపుల కోసం మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక ఆప్షన్‌ను జత చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీసీసీ దేశాల్లో(సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, కువైత్) ఆరు నెలల కంటే ఎక్కువ నివాసం ఉన్న ప్రవాసులతో పాటు 2008లో తీసుకువచ్చిన మంత్రివర్గ తీర్మానం నం. 220 ప్రకారం ప్రత్యేక వృత్తులు కలిగిన వారు టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మంత్రివర్గ తీర్మానం ప్రకారం జీసీసీ దేశాల్లోని ఈ క్రింది వృత్తులవారు టూరిస్ట్ ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. అవెంటంటే.. కన్సల్టెంట్స్, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, జడ్జిలు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులు, యూనివర్శిటీ అధ్యాపకులు, ప్రెస్ అండ్ మీడియా సిబ్బంది, పైలట్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, సీస్టం అనలిస్ట్స్, మేనేజర్స్, వ్యాపారవేత్తలు, దౌత్య దళం, యూనివర్శిటీ గ్రాడ్యుయేట్స్, సౌదీ ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు.
మార్గదర్శకాలు/నియమాలు..
* దేశంలోకి ప్రవేశించిన వెంటనే ఎంట్రీ పాయింట్ వద్ద వీసా ఫీజుగా 3 కువైటీ దినార్లు(రూ.737) చెల్లించాలి.
* ఈ-వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు పాస్‌పోర్ట్ చెల్లుబాటు ఆరు నెలల కంటే ఎక్కువ ఉండాలి.
* ఒక టూరిస్ట్ వీసా కువైత్‌లోకి ఒక్క ఎంట్రీ కోసం మాత్రమే జారీ చేయబడుతుంది. అది కూడా ఒక నెల గడవుతో మాత్రమే.
* టూరిస్ట్ వీసా కలిగిన వారు ఎంట్రీ తేదీ నుంచి తాత్కాలికంగా మూడు నెలల వరకు కువైత్‌లో నివాసం ఉండొచ్చు. అలాగే గడువు ముగియడానికి ముందే వీసాదారు దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
* టూరిస్ట్ వీసా హోల్డర్ దేశంలో పని చేయడానికి అనుమతి ఉండదు. ఒకవేళ వీసాదారు ఈ నియమాన్ని ఉల్లంఘించి పట్టుబడితే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.
* అనుమతించబడిన వ్యవధిని దాటిన సందర్శకుడికి జరిమానా విధిస్తారు. అలాగే చట్టపరమైన జవాబుదారీతనానికి లోబడి భవిష్యత్తులో వీసా జారీ చేయకుండా అతడు/ఆమెను అనర్హులుగా ప్రకటిస్తారు.
* సమర్పించిన దరఖాస్తులను అధికారిక పని దినాలలో పని గంటలలోపు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇందులో కువైత్ వారాంతాలు (శుక్ర, శనివారం), ప్రభుత్వ సెలవులు ఉండవు.
* పర్యాటక ఈ-వీసా దరఖాస్తు స్టేటస్(ఆమోదించబడిన లేదా తిరస్కరించబడిన)ను ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
ఇక పర్యాటక ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్న 53 దేశాల జాబితా ఇదే..
Andorra
Australia
Austria
Belgium
Bhutan
Brunei
Bulgaria
Cambodia
Canada
Croatia
Cyprus
Czech
Denmark
Estonia
Finland
France
Georgia
Germany
Greece
Hungary
Iceland
Ireland
Italy
Japan
Laos
Latvia
Liechtenstein
Lithuania
Luxembourg
Malaysia
Malta
Monaco
Netherlands
New Zealand
Norway
Poland
Portugal
Romania
San Marino
Serbia
Singapore
Slovakia
Slovenia
South Korea
Spain
Sweden
Switzerland
The People’s Republic of China – Hong Kong
Turkey
Ukraine
United Kingdom
United States
Vatican