విద్యార్థికి కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-08-20T23:40:19+05:30 IST

విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు పెద్ద మనసు చాటుకున్నారు. పేద విద్యార్థికి అండగా నిలిచారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కలికిరి సైనిక్ స్కూల్ కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జి. విన

విద్యార్థికి కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆర్థిక సాయం

కర్నూలు: విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు పెద్ద మనసు చాటుకున్నారు. పేద విద్యార్థికి అండగా నిలిచారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కలికిరి సైనిక్ స్కూల్ కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జి. వినయ్ కుమార్ అనే విద్యార్థి ప్రతిభ కనబర్చి, సీటు సాధించాడు. ఆర్థిక కారణాల వల్ల ఫీజు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న వినయ్‌ కుమార్‌కు ఎన్నారైలు రమేష్ (అమెరికా), డాక్టర్ ప్రసాద్ (ఆస్ట్రేలియా) అండగా నిలిచారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ద్వారా మొదటి సంవత్సరం ఫీజు నిమిత్తం రూ.30వేలను అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును కర్నూల్ డీఎస్సీ రవి (సీఐడీ).. ఆగస్టు 20న వినయ్ కుమార్‌కు అందించారు.


ఈ సందర్భంగా డీఎస్పీ రవి మాట్లాడారు. ఆర్థిక కారణాల వద్ద ప్రతిభావంతులైన విద్యార్థులు ఇబ్బందులు పడకుదనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సేవలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కాగా.. కొత్తకోట గ్రామానికి చెందిన విద్యార్థి సైనిక్ స్కూల్‌లో సీటు సాధించడం గర్వకారణమని, ప్రతిభ ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేసినట్టు ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి పొట్లూరి తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రతిభావంతులకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి తోడ్పతున్న పలువురు ఎన్నారైలకు ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ శ్రీనివాసులు, సీఐ డేగల ప్రభాకర్, సందడి మధు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-20T23:40:19+05:30 IST