కువైత్‌లో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T01:22:45+05:30 IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సంబరాలు తెరాస కువైత్ అధ్యక్షులు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టినటు

కువైత్‌లో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

కువైత్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సంబరాలు తెరాస కువైత్ అధ్యక్షులు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టినటువంటి "ముక్కోటి వృక్షార్చన" కార్యక్రమంలో భాగంగా కువైత్‌లో టీఆర్ఎస్ కువైత్ సభ్యులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే మొక్కలు నాటి, కేక్ కట్ చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షురాలు అభిలాష మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కేవలం తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. మంత్రి కేటీఆర్ నూరేళ్లపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కువైత్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, కమిటీ సభ్యులు రవి గన్నరపు, సురేష్ గౌడ్, జగదీశ్, సుభాన్, రవి సుధగాని, సమియుద్దీన్, జమీల్, దస్తగిర్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T01:22:45+05:30 IST