వ్యాక్సిన్ తీసుకున్న అమెరికా ప్రముఖ నటి!

ABN , First Publish Date - 2021-02-01T22:49:45+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది

వ్యాక్సిన్ తీసుకున్న అమెరికా ప్రముఖ నటి!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా ప్రముఖ నటి 83ఏళ్ల జేన్ ఫోండా.. తాజాగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్‌స్ట్రా‌గ్రామ్‌లో చూసిన ఆమె.. ‘కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఈ రోజు తీసుకున్నాను.. ఇది బాధించదు’ అని పేర్కొన్నారు. కాగా.. జేన్ ఫొండా రెండుసార్లు ఆస్కార్‌ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పర్యవరణ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. 


ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో లక్ష మందికిపైగా మహమ్మారి బారినపడగా.. సుమారు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 2.67కోట్లకు చేరింది. 4.52లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-02-01T22:49:45+05:30 IST