న‌ర్సు నిర్వాకం.. యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా!

ABN , First Publish Date - 2021-05-12T13:21:57+05:30 IST

ఓ యువతి(23)కి ఏకంగా ఆరుడోసుల ఫైజర్‌ టీకాను ఎక్కించిన ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ఒక సీసాలో మొత్తం ఆరు టీకా డోసులుంటాయి.

న‌ర్సు నిర్వాకం.. యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా!

రోమ్‌: ఓ యువతి(23)కి ఏకంగా ఆరుడోసుల ఫైజర్‌ టీకాను ఎక్కించిన ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ఒక సీసాలో మొత్తం ఆరు టీకా డోసులుంటాయి. ఆ సమయంలో టీకాలు వేస్తున్న మహిళ, ఆదమరుపుగా మొత్తం సీసాను ఇంజక్షన్‌లోకి ఎక్కించి యువతికి చేసేసింది. విషయం తెలిసిన వైద్యులు, యువతిని ఆస్పత్రిలోనే 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉండటంతో ఆ తర్వాత డిశ్చార్జి చేశారు. అయితే.. ఆమె పరిస్థితిని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పరిశీలించున్నామని వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. 


Updated Date - 2021-05-12T13:21:57+05:30 IST