ఇద్దరు భారత సంతతి దక్షిణాఫ్రికా మహిళలకు అంతర్జాతీయ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-03-14T15:31:19+05:30 IST

ఇద్దరు భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా మహిళలు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇద్దరు భారత సంతతి దక్షిణాఫ్రికా మహిళలకు అంతర్జాతీయ ప్రశంసలు

జోహన్నెస్‌బర్గ్: ఇద్దరు భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా మహిళలు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటున్నారు. వీరిలో ఒకరు సౌతాఫ్రికాలోని ప్రిటోరియా నగరానికి చెందిన 21 ఏళ్ల బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారవేత్త కాగా, మరోకరు 30 ఏళ్ల ఆర్కిటెక్చర్ ఉన్నారు. వీరి ఆదర్శప్రాయమైన నాయకత్వానికి ఈ ప్రశంసలు దక్కుతున్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారవేత్త అయిన రాబియా ఘూర్.. 2021 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఉమెన్ ఆఫ్రికా ‘యంగ్ అచీవర్స్’ అవార్డు అందుకున్నారు. అలాగే ఆర్కిటెక్చర్ సుమయ్య వల్లి 2021 ఏడాది టైమ్స్ 100 మంది భవిష్యత్తును రూపొందిస్తున్న నాయకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో చిన్న వయసులోనే ఈ ఘనతను సాధించిన వీరికి అంతర్జాతీయ ప్రశంసలు దక్కుతున్నాయి.  

Updated Date - 2021-03-14T15:31:19+05:30 IST