అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన... NRIకి షాక్!
ABN , First Publish Date - 2021-09-30T02:25:58+05:30 IST
అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన భారతీయ సంతతికి చెందిన తాజాగా 25 రోజుల జైలు శిక్ష పడింది.
సింగపూర్: అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన భారతీయ సంతతికి చెందిన ఓ యువకుడికి సింగపూర్లో 25 రోజుల జైలు శిక్ష పడింది. నిందితుడు దమన్దీప్ సింగ్(23) తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో తాజాగా ఈ శిక్ష ఖరారైంది. దమన్ దీప్ సింగ్ 2019లో తాను ఉంటున్న అద్దె ఇంటిని ఓనర్కు తెలీకుండా మరో పది మందికి అద్దెకు ఇచ్చాడు. దీంతో..ఇంట్లో హడావుడి పెరిగిపోయి చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా..ఇళ్ల తనిఖీ కోసం వచ్చిన ఓ అధికారితో ఉన్న పరిచయంతో దమన్దీప్ సింగ్ ఇంటి తనిఖీ ఎప్పుడు జరిగేదీ తెలుసుకుని ఆ సమయంలో ఇంట్లో వారిని బయటకు పంపించేవాడు. అతడి నిర్వాకం మొత్తం బయటపడి చివరికి జైలు పాలయ్యాడు. కాగా..తనిఖీ వివరాలను దమన్దీప్కు వెల్లడించిన అధికారికి కూడా కోర్టు గత నెలలోనే 25 రోజుల జైలు శిక్ష విధించింది.