తండ్రి మరణం.. వీసా కోసం ఎంబసీకి వెళ్లిన NRI మహిళ.. అక్కడ వీసా ఆఫీసర్ ప్రవర్తన చూసి..

ABN , First Publish Date - 2021-12-02T00:23:11+05:30 IST

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఎన్నారై మహిళకు ఇండియన్ ఎంబసీలో చేదు అనుభవం ఎదురైంది. వీసా కోసం ఎంబసీకి వెళ్లిన మహిళపట్ల ఇండియన్ అధికారి కఠినంగా వ్యవహరించారు. తం

తండ్రి మరణం.. వీసా కోసం ఎంబసీకి వెళ్లిన NRI మహిళ.. అక్కడ వీసా ఆఫీసర్ ప్రవర్తన చూసి..

ఎన్నారై డెస్క్: తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఎన్నారై మహిళకు ఇండియన్ ఎంబసీలో చేదు అనుభవం ఎదురైంది. వీసా కోసం ఎంబసీకి వెళ్లిన మహిళపట్ల ఇండియన్ అధికారి కఠినంగా వ్యవహరించారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉందన్న విషయాన్ని కూడా మరిచి.. బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ అధికారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇండియాకు చెందిన మహిళ తన భర్తతో అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఆమె తన తండ్రిని కోల్పోయింది. ఫోన్ ద్వారా విషయం తెలియడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రిని చివరి చూపు చూడాలనే ఉద్దేశంతో పుట్టెడు దుఃఖంలోనే వీసా కోసం భర్తతో కలిసి న్యూయార్క్‌లోని ఇండియన్ ఎంబసీకి వెళ్లింది. అక్కడ తన పరిస్థితిని వివరించి.. వీసా ఇవ్వాలని కోరింది. అయితే అక్కడ వీసా ఆఫీసర్‌గా పని చేస్తున్న విజయ్ శంకర్ ప్రసాద్.. వీసా ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె షాకైంది. అంతేకాకుండా ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా కంగుతింది. ‘ఆఫీస్ నుంచి బయటికి వెళ్లండి. లేకుంటే.. ఇంకెప్పటికీ మీరు ఇండియాకు వెళ్లే  వీలు లేకుండా మిమ్మల్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతా’ అని బెదిరించడంతో సదరు మహిళ విస్తుపోయింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె.. ‘ఈయన విజయ్ శంకర్ ప్రసాద్. ఇక్కడ వీసా ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ఇండియాకు ప్రాతినిధ్యం వహించేది ఇలాగేనా?’ అంటూ అతడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్ అయింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. సదరు ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విజయ్ శంకర్ ప్రసాద్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. 


Updated Date - 2021-12-02T00:23:11+05:30 IST