Covaxin: భారతీయులకు అమెరికా తీపి కబురు!

ABN , First Publish Date - 2021-11-05T20:24:41+05:30 IST

భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం లభించిన విషయం తెలిసిందే.

Covaxin: భారతీయులకు అమెరికా తీపి కబురు!

వాషింగ్టన్: భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం లభించిన విషయం తెలిసిందే. దీంతో అగ్రరాజ్యం అమెరికా కూడా కోవాగ్జిన్ తీసుకున్న భారతీయ ప్రయాణికులను తమ దేశానికి వచ్చేందుకు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) గురువారం కీలక ప్రకటన చేసింది. 'డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన కోవాగ్జిన్‌ను ఎఫ్‌డీఏ కూడా అనుమతి ఇస్తోంది. కనుక కోవాగ్జిన్ తీసుకున్న భారత ప్రయాణికులు కూడా అమెరికా రావచ్చు' అని వెల్లడించింది. 


ఇక డబ్ల్యూహెచ్ఓ, ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టీకాలతో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీయులను తమ దేశానికి వచ్చేందుకు అమెరికా గతవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 8 నుంచి విదేశీయులు అమెరికా వెళ్లొచ్చు. కాగా, అమెరికా ట్రావెల్ నిబంధనల ప్రకారం ఫైజర్-బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్-అస్ట్రాజెనెకా, కోవిషీల్డ్, సినోఫార్మ్, సినోవాక్ టీకాలు తీసుకున్న విదేశీయులు ఆ దేశానికి వెళ్లేందుకు అర్హులు. ఇదిలా ఉంటే.. ఇండియాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ భారత్ బయోఎన్‌టెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా రూపొందించిన కోవాగ్జిన్ టీకా కరోనాపై 78 శాతం సమర్థతతో పని చేస్తోంది. ఇది తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు అత్యంత అనుకూలమైనది. ఎందుకంటే నిల్వ చేయడం చాలా సులభం.     


Updated Date - 2021-11-05T20:24:41+05:30 IST