భార‌త విద్యార్థినికి యూఏఈ గోల్డెన్ వీసా

ABN , First Publish Date - 2021-05-30T16:49:56+05:30 IST

భార‌త విద్యార్థిని తస్నీమ్ అస్లమ్‌కు యూఏఈ గోల్డెన్ వీసా ద‌క్కింది. ఎక్ససెప్షనల్ స్టూడెంట్ కేట‌గిరీలో తస్నీమ్ ఈ గోల్డెన్ వీసా ద‌క్కించుకుంది. దీంతో ఆమెకు 10 ఏళ్ల పాటు అంటే 2031 వ‌ర‌కు యూఏఈలో నివాసం ఉండే అవ‌కాశం ఏర్ప‌డింది.

భార‌త విద్యార్థినికి యూఏఈ గోల్డెన్ వీసా

అబుధాబి: భార‌త విద్యార్థిని తస్నీమ్ అస్లమ్‌కు యూఏఈ గోల్డెన్ వీసా ద‌క్కింది. ఎక్ససెప్షనల్ స్టూడెంట్ కేట‌గిరీలో తస్నీమ్ ఈ గోల్డెన్ వీసా ద‌క్కించుకుంది. దీంతో ఆమెకు 10 ఏళ్ల పాటు అంటే 2031 వ‌ర‌కు యూఏఈలో నివాసం ఉండే అవ‌కాశం ఏర్ప‌డింది. ఇక త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం ప‌ట్ల తస్నీమ్ ఆనందం వ్య‌క్తం చేసింది. ఇది త‌న జీవితంలోనే మ‌రిచిపోలేని మ‌ధుర జ్ఞాపకంగా ఆమె పేర్కొంది. తాను చ‌దువులో రాణించి, మెరిట్ సాధించ‌డం వ‌ల్లే ఇదంతా సాధ్య‌మైంద‌ని తెలిపింది. త‌న పేరెంట్స్ స‌పోర్ట్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగ‌లిగాన‌ని పేర్కొంది.


తస్నీమ్ షార్జాలోని అల్ ఖాసిమియా విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ షరియాను అభ్యసించింది. 72 దేశాల విద్యార్థులు గ‌ల త‌న క్లాస్‌లో ఆమె టాప్‌లో నిలిచింది. మొత్తం 4 గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ)కు గాను త‌స్లీమ్‌ 3.94 సాధించ‌డం విశేషం. అలాగే ఆమె షార్జా యూనివ‌ర్శిటీ నుంచి ఫిఖ్(ఇస్లామిక్ న్యాయ శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప‌ట్టా కూడా పొందింది. త‌స్లీమ్‌ది కేర‌ళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లా. కూతురు సాధించిన ఈ ఘ‌న‌త ప‌ట్ల‌ త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌స్నీమ్ తండ్రి మొహ‌మ్మ‌ద్ అస్లాం షార్జా సిటీ మున్సిపాలిటీ మాజీ ఉద్యోగి. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమిరేట్‌లో టైప్‌ రైటింగ్ కేంద్రాన్ని న‌డుపుతున్నారు.        

Updated Date - 2021-05-30T16:49:56+05:30 IST