యూఏఈ రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి దుర్మరణం!

ABN , First Publish Date - 2021-07-08T16:04:45+05:30 IST

యూఏఈలో విషాద ఘటన చోటు చేసుకుంది. అబుధాబిలోని యాస్ ఐల్యాండ్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల భారత విద్యార్థి మృతి చెందాడు.

యూఏఈ రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి దుర్మరణం!

అబుధాబి: యూఏఈలో విషాద ఘటన చోటు చేసుకుంది. అబుధాబిలోని యాస్ ఐల్యాండ్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల భారత విద్యార్థి మృతి చెందాడు. ఇబాద్ అజ్మల్ అనే టీనేజర్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఇబాద్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలొదిలాడు. ప్రమాద సమయంలో కారులో ఇబాద్ ఒక్కడే ఉన్నట్లు తెలిసింది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఇబాద్ తల్లిదండ్రులు అజ్మల్ రషీద్, నబీలా అబుధాబిలో స్థిరపడ్డారు. ఇబాద్ ప్రస్తుతం యూకేలోని సౌత్ వేల్స్ కార్డిఫ్ క్యాంపస్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ అండ్ మెయింటెన్స్ సీస్టం చదువుతున్నాడు. గత నెలలో బ్రిటన్ నుంచి అబుధాబి వచ్చిన ఇబాద్ ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బుధవారం సాయంత్రం అబుధాబిలోనే ఇబాద్ అంత్యక్రియలు నిర్వహించినట్లు బంధువు ఒకరు తెలిపారు. అబుధాబి ఇండియన్ స్కూల్‌లో టెన్త్ పూర్తి చేసిన ఇబాద్, బ్రైట్ రైడర్స్ స్కూల్‌లో పన్నెండో తరగతి వరకు చదివాడు. ఇబాద్‌కు తోబుట్టువులు నోహా, అలీయా, ఒమర్ ఉన్నారు.  

Updated Date - 2021-07-08T16:04:45+05:30 IST