ఎన్నారై జంట జైలుపాలు! భార్యకు 3 రోజులు.. భర్తకు 8 నెలల ఖైదు..! అసలేం జరిగిదంటే..

ABN , First Publish Date - 2021-12-20T02:25:04+05:30 IST

నిబంధనలు ఉల్లంఘించి మరీ పనిమనిషిని నియమించుకున్న కేసుకు సంబంధించి సింగపూర్‌లో నివసిస్తున్న ఓ ఎన్నారై జంటకు జైలు పడింది. భార్యకు మూడు రోజులు, భర్తకు 8 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

ఎన్నారై జంట జైలుపాలు! భార్యకు 3 రోజులు.. భర్తకు 8 నెలల ఖైదు..! అసలేం జరిగిదంటే..

ఇంటర్నెట్ డెస్క్: నిబంధనలు ఉల్లంఘించి మరీ పనిమనిషిని నియమించుకున్న కేసుకు సంబంధించి సింగపూర్‌లో నివసిస్తున్న ఓ ఎన్నారై జంటకు జైలు పడింది. భార్యకు మూడు రోజులు, భర్తకు 8 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.  విచారణ సందర్బంగా నిందితులు సయ్యద్ అమీర్ హమ్జా, ఆయన భార్య సాభా పర్వీన్ తాము నేరం చేసినట్టు అంగీకరించారు. తాము బ్లాక్ లిస్టులో ఉన్నామని తెలిసీ మరో వ్యక్తి సాయంతో అమీర్ హమ్జా ఇండోనేషియాకు చెందిన అమీనా అనే యువతిని పనిలో పెట్టుకున్నారు. ఇందుకోసం అమీర్ తనకు తెలిసిన వ్యక్తి గుర్తింపు కార్డులను వినియోగించాడు. 


కాగా.. అమీనా కూడా ఆ జంటపై ఫిర్యాదు చేసింది. తనకు తగినంత రెస్ట్ ఇచ్చేవారు కాదని, వేతనం ఇచ్చే విషయంలోనూ ఇబ్బందులు సృష్టించారని ఫిర్యాదు చేసింది. అయితే.. కోర్టు మాత్రం ఈ ఆరోపణల నుంచి వారికి తాత్కాలిక విముక్తి ఇచ్చింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇతర ఆధారాలు లభ్యమైన పక్షంలో విచారణ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బ్లాక్ లిస్ట్ నిబంధనల ఉల్లంఘన, న్యాయప్రక్రియకు విఘాతం కలిగించడం వంటి నేరాలపై అమీర్‌కు కోర్టు 8 నెలల శిక్ష విధించింది. న్యాయప్రక్రియలకు విఘాతం కలిగించిందన్న నేరంపై  అతడి భార్యకు మూడు రోజుల శిక్ష పడింది. అయితే.. ఆ జంటకు పిల్లలు కూడా ఉండటంతో.. వారి బాగోగులకు తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు అమీర్‌కు వీలు కల్పించిన కోర్టు అతడికి వచ్చే ఏడాది జనవరి 3 నుంచి శిక్ష అమలవుతుందని తీర్పు వెలువరించింది. 

Updated Date - 2021-12-20T02:25:04+05:30 IST