కువైత్ కేరళ ప్రీమియర్ లీగ్‌లో విషాదం.. మైదానంలోనే ప్రాణాలొదిలిన భారత వ్యక్తి!

ABN , First Publish Date - 2021-08-10T13:24:31+05:30 IST

కువైత్ క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్న కువైత్ కేరళ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. సులైభికత్ క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎఫ్ఎఫ్‌సీకి ఆడుతున్న రెని జాకబ్ అనే భారతీయ వ్యక్తి గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు.

కువైత్ కేరళ ప్రీమియర్ లీగ్‌లో విషాదం.. మైదానంలోనే ప్రాణాలొదిలిన భారత వ్యక్తి!

కువైత్ సిటీ: కువైత్ క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్న కువైత్ కేరళ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. సులైభికత్ క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎఫ్ఎఫ్‌సీకి ఆడుతున్న రెని జాకబ్ అనే  భారతీయ వ్యక్తి గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. ఫీల్డిండ్ చేస్తున్న సమయంలో జాకబ్‌కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. జాకబ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు.


కళ్ల ముందే జాకబ్ ప్రాణాలు కోల్పోవడంతో వారు రోధించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. కేరళలోని అల్ఫూజాకు  చెందిన జాకబ్ హసాన్స్ ఆప్టిసియన్స్‌లో పని చేస్తున్నారు. అతని మృతిపట్ల కువైత్ క్రికెట్ క్లబ్ సంతాపం తెలిపింది. జాకబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేసింది. వారం రోజుల పాటు ప్రస్తుతం జరుగుతున్న టోర్నీని వాయిదా వేసింది. వచ్చే వారం నుంచి జరిగే మ్యాచుల్లో ఆటగాళ్లు జాకబ్‌ మృతికి సంతాపంగా నల్ల బ్యాడ్జీలు ధరించాలని కువైత్ క్రికెట్ డైరెక్టర్ జనరల్ సాజిద్ అష్రాఫ్ సూచించారు.   

Updated Date - 2021-08-10T13:24:31+05:30 IST