కెనడా వైపు భారత నిపుణుల చూపు!

ABN , First Publish Date - 2021-07-16T11:37:46+05:30 IST

అగ్రరాజ్యం అనుసరిస్తున్న కాలం చెల్లిన హెచ్‌1బీ వీసా విధానాలతో భారత నిపుణులు విసిగి వేసారిపోయారా? అందుకే అమెరికాను కాదని పెద్దసంఖ్యలో కెనడా వైపు తరలిపోతున్నారా? అవుననే అంటున్నారు అగ్రరాజ్యానికి చెందిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు, విధాన నిర్ణాయక నిపుణులు! ఇదే విషయాన్ని వారు కాంగ్రెస్‌ ప్రతినిధులకు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

కెనడా వైపు భారత నిపుణుల చూపు!

వాషింగ్టన్‌, జూలై 15: అగ్రరాజ్యం అనుసరిస్తున్న కాలం చెల్లిన హెచ్‌1బీ వీసా విధానాలతో భారత నిపుణులు విసిగి వేసారిపోయారా? అందుకే అమెరికాను కాదని పెద్దసంఖ్యలో కెనడా వైపు తరలిపోతున్నారా? అవుననే అంటున్నారు అగ్రరాజ్యానికి చెందిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు, విధాన నిర్ణాయక నిపుణులు! ఇదే విషయాన్ని వారు కాంగ్రెస్‌ ప్రతినిధులకు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అమెరికా హెచ్‌1బీ వీసా విధానాలతో పాటు శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డుల జారీలో తీవ్ర ప్రతిబంధకంగా మారిన దేశాల వారీ కోటాకు సంబంధించి భారత యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే కెనడా వైపు దృష్టి సారిస్తున్నారంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలం చెల్లిన వీసా విధానాలను సవరించాల్సిన సమయం ఆసన్నమైందని వారు చెబుతున్నారు.



 తాజా గణాంకాలను పరిశీలిస్తే.. మూడు కేటగిరీలకు చెందిన ఉపాధి ఆధారిత  గ్రీన్‌కార్డుల జారీ కోసం 9,15,497 మంది భారతీయులు ఎదురుచూస్తున్నారని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ(ఎన్‌ఎ్‌ఫఏపీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్టువర్ట్‌ ఆండర్సన్‌ వెల్లడించారు. 2030 నాటికి వీరి సంఖ్య 21,95,795కి చేరుతుందని అంచనా అని పౌరసత్వం, వలసలపై ఏర్పాటైన సభాకమిటీకి వివరించారు. విదేశీ వి ద్యార్థులు, నిపుణులను ఆకర్షించేందుకు కెనడా తన వీసా విధానాలను సరళతరం చేసిందని చెప్పారు. అందుకే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు కెనడా వైపు అడుగులేస్తున్నారని ఆండర్సన్‌ చెప్పారు.


Updated Date - 2021-07-16T11:37:46+05:30 IST