రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన భారతీయుడు.. ఎలా అంటే!
ABN , First Publish Date - 2021-05-13T05:36:57+05:30 IST
ఉపాధి కోసం ఒమన్ వెళ్లిన ఓ భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన శ్యామ్ అనే వ్యక్తి దాదాపు 18ఏళ్లుగా ఒమన్‌లో పనిచూస్తూ త

మస్కట్: ఉపాధి కోసం ఒమన్ వెళ్లిన ఓ భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన శ్యామ్ అనే వ్యక్తి దాదాపు 18ఏళ్లుగా ఒమన్‌లో పనిచూస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆయన ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. కాగా.. ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు మహజూజ్ డ్రాలో జాక్‌పాట్ తగిలింది. దీంతో 1 మిలియన్ దిర్హమ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.2కోట్లు) గెలుచుకుని రాత్రికి రాత్రికి కోటీశ్వరుడయ్యాడు. మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న శ్యామ్.. ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. అనంతరం తేరుకుని సంతోషం వ్యక్తం చేశాడు. గెలుచుకున్న డబ్బుతో కేరళలో ఇల్లు కట్టనున్నట్టు పేర్కొన్నాడు. మిగిలిన మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోనున్నట్టు తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఇదే డ్రాలో సుల్తాన్ అనే యూఏఈ పౌరుడు కూడా 1 మిలియన్ దిర్హమ్లను గెలుచుకున్నాడు.