24న Kuwait లోని భారత ఎంబసీలో 'ఓపెన్ హౌస్' కార్యక్రమం.. పలు కీలక అంశాలపై చర్చ..
ABN , First Publish Date - 2021-11-21T17:39:34+05:30 IST
కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ నెల 24న(బుధవారం) ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ నెల 24న(బుధవారం) ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఎంబసీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు(కువైత్ కాలమానం ప్రకారం) రాయబారి సీబీ జార్జ్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రంలో ప్రధానంగా కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ స్టేటస్‌తో పాటు భారత పాస్‌పోర్టు, వీసాల అప్డేట్ తదితర విషయాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో కువైత్‌లోని భారత ప్రవాసులందరూ పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఎంబసీ అధికారిక ఈ-మెయిల్ community.kuwait@mea.gov.inకు తమ వివరాలను పంపించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే వాలంటీర్‌గా రిజిస్టర్ చేసుకున్నవారిని కూడా అనుమతిస్తారు. కాగా, కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయివారికి మాత్రమే ఆడిటోరియంలో ప్రవేశానికి అనుమతి ఉంటుంది.
అలాగే వర్చువల్‌గా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. జూమ్ ద్వారా ఈ కార్యక్రమంలో https://zoom.us/j/99832801639?pwd=MlRKeDJxaWxmMGkybmxZR0JZc2Nqdz09 లింక్ ద్వారా పాల్గొనే వెసులుబాటు ఉంది. ఇతర సందేహాల నివృత్తి కోసం పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నంబర్, సివిల్ ఐడీ నంబర్, కాంటాక్ట్ నంబర్, కువైత్‌లో ఉంటున్న చిరునామా) community.kuwait@mea.gov.inకు మెయిల్ చేయాలి.