యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీ పదవికి నామినేట్ అయిన ఇండియన్ అమెరికన్

ABN , First Publish Date - 2021-12-08T21:52:18+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇండియన్ అమెరికన్‌ను కీలక పదవికి నామినేట్ చేశారు. భారత సంతతికి చెందిన డాక్టర్ రవి చౌదరిని

యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీ పదవికి నామినేట్ అయిన ఇండియన్ అమెరికన్

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇండియన్ అమెరికన్‌ను కీలక పదవికి నామినేట్ చేశారు. భారత సంతతికి చెందిన డాక్టర్ రవి చౌదరిని ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా బైడన్ నామినేట్ చేశారు. డాక్టర్ రవి చౌదరిని అసిస్టెంట్ సెక్రటరీగా బైడెన్ నామినేట్ చేసిన సమాచారం సోమవారం సెనేట్ కూడా చేరింది. ఈ నియామకానికి సెనేట్ ఆమోదముద్ర వేస్తే.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా డాక్టర్ రవి చౌదరి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదిలా ఉంటే.. ఒబామా ప్రభుత్వ హయాంలో కూడా డాక్టర్ రవి చౌదరి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆసియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐస్‌లాండర్స్‌పై పని చసిన ప్రెసిడెంట్స్ అడ్వైజరీ కమిషన్‌లో సభ్యుడిగా డాక్టర్ రవి చౌదరి విధులు నిర్వర్తించారు. అంతకు ముందు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆప్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశారు. Updated Date - 2021-12-08T21:52:18+05:30 IST