సాలిస్‌బరీ సిటీ కౌన్సిల్ ఎన్నికల బరిలో భారతీయురాలు.. గెలిస్తే చరిత్రే..

ABN , First Publish Date - 2021-08-20T16:43:21+05:30 IST

భారతీయ అమెరికన్ మహిళా వ్యాపారవేత్త నలిని జోసెఫ్(53) సాలిస్‌బరీ సిటీ కౌన్సిల్ ఎన్నికల బరిలో నిలిచారు. నవంబర్‌లో జరిగే ఈ ఎన్నికల్లో జోసెఫ్ గెలిస్తే.. చరిత్ర సృష్టిస్తారు. ఈ పదవి చేపట్టే తొలి ఇండో-అమెరికన్‌గా ఆమె నిలుస్తారు.

సాలిస్‌బరీ సిటీ కౌన్సిల్ ఎన్నికల బరిలో భారతీయురాలు.. గెలిస్తే చరిత్రే..

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ మహిళా వ్యాపారవేత్త నలిని జోసెఫ్(53) సాలిస్‌బరీ సిటీ కౌన్సిల్ ఎన్నికల బరిలో నిలిచారు. నవంబర్‌లో జరిగే ఈ ఎన్నికల్లో జోసెఫ్ గెలిస్తే.. చరిత్ర సృష్టిస్తారు. ఈ పదవి చేపట్టే తొలి ఇండో-అమెరికన్‌గా ఆమె నిలుస్తారు. ప్రస్తుతం ఆమె గార్డియన్ యాడ్ లైటెమ్‌లో జిల్లా అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 8 ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. లీడర్‌షిప్, పరిపాలన విభాగంలో ఆమెకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పిల్లల సంక్షేమం, కుటుంబ సేవల కోసం అడ్వొకసీలో వివిధ ప్రైవేట్, ప్రభుత్వరంగా సంస్థలతో కలిసి పనిచేశారు. పిల్లల కోసం ఎలాంటి లాభాపేక్షలేని విద్యా సంస్థ విలియం జోన్స్ స్కాలర్స్‌ను కూడా స్థాపించారు జోసెఫ్. ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన జోసెఫ్.. ప్రస్తుతం సాలిస్‌బరీ నగరంలో ప్రజా భద్రత ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మెరుగైన బడ్జెట్ విధానం ద్వారా చట్ట అమలు, నేరాల రేటును తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆమె నొక్కి చెప్పారు. 

Updated Date - 2021-08-20T16:43:21+05:30 IST