వాటిని ఎదుర్కోవడంలో భారత్-యూఎస్ భాగస్వామ్యం ఇప్పుడు చాలా కీలకం: రో ఖన్నా

ABN , First Publish Date - 2021-08-21T20:43:00+05:30 IST

తాలిబన్, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్-అమెరికా భాగస్వామ్యం ఇప్పుడు మరింత కీలకమని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు.

వాటిని ఎదుర్కోవడంలో భారత్-యూఎస్ భాగస్వామ్యం ఇప్పుడు చాలా కీలకం: రో ఖన్నా

వాషింగ్టన్: తాలిబన్, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్-అమెరికా భాగస్వామ్యం ఇప్పుడు మరింత కీలకమని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితిలో అది అంతా సులువు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు తాలిబాన్లను, తీవ్రవాదాన్ని నిరోధించడం మరింత క్లిష్టంగా మారనుందని ఖన్నా పేర్కొన్నారు. ప్రతినిధుల సభలో సిలికాన్ వ్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖన్నా.. హౌస్‌లోని ఇండియన్ అమెరికన్ కాంగ్రెషనల్ కాకస్ డెమొక్రాటిక్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. జాతీయ భద్రతపై భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాను ఇండియా కాకస్ నాయకత్వంతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా ఖన్నా చెప్పారు.


Updated Date - 2021-08-21T20:43:00+05:30 IST