కరోనా మహమ్మారి తర్వాత.. America లో వింత పరిణామం.. విస్తుపోతున్న ప్రవాసులు..

ABN , First Publish Date - 2021-10-15T00:42:12+05:30 IST

భారతీయులకు బంగారం అంటే మక్కువన్న విషయం తెలిసిందే. బంగారు ఆభరాణాలు, వజ్రాలు పొదిగిన నగలకు ఇక్కడ మంచి డిమాండే ఉంది. అయితే..కరోనా తరువాత అమెరికాలోనూ ఇంచుమించు ఇటువంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్నారైలు విస్తుపోయే స్థాయిలో అక్కడి వారు వజ్రాల కోసం ఎగబడుతున్నారు.

కరోనా మహమ్మారి తర్వాత.. America లో వింత పరిణామం.. విస్తుపోతున్న ప్రవాసులు..

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు బంగారం అంటే మక్కువన్న విషయం తెలిసిందే. బంగారు ఆభరాణాలు, వజ్రాలు పొదిగిన నగలకు ఇక్కడ మంచి డిమాండే ఉంది. అయితే..కరోనా తరువాత అమెరికాలోనూ  ఇంచుమించు ఇటువంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్నారైలు విస్తుపోయే స్థాయిలో అక్కడి వారు వజ్రాల కోసం ఎగబడుతున్నారు. చైనా దిగుమతులపై అమెరికా ప్రభుత్వం సుంకాల రూపంలో ఆంక్షలు విధిస్తుండటంతో.. భారత్‌ నుంచి ఎగుమతయ్యే వజ్రాలకు భారీగా డిమాండ్ పెరిగింది.


ఈ డిమాండ్ ఏస్థాయిలో ఉందంటే.. గూజరాత్‌లోని సూరత్ నగరంలో ఒకప్పుడు 300 దుకాణాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 500లకు పెరిగింది. అమెరికాలో హిప్ హాప్ సంస్కృతిని ఫాలో అయ్యే  వాళ్ల నుంచి వజ్రాల కోసం ఆర్డర్లు వస్తున్నాయట. వజ్రాలు పొదిగిన రోలేక్స్ వాచ్‌లు లేదా ఇతర ఆభరణాలు ధరించడం అక్కడి సంస్కృతిలో ఒక భాగం. దీంతో..అక్కడ వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని సార్లు అక్కడి వినియోగదారులు తమకు డిజైన్లు పంపిస్తారని, మరికొన్ని సందర్భాల్లో తాము వారికి నచ్చినట్టు డిజైన్ చేసి పంపిస్తామని సూరత్ వర్తక సంఘం అధ్యక్షుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సూరత్‌ నుంచి  ఇటువంటివి నెలకు దాదాపు 5 వేల వరకూ ఎగుమతి అవుతున్నాయి. గతంలో వీటి డిమాండ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కరోనా తరువాత మాత్రం ఒక్కసారిగా డిమాండ్ పెరిగి..పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. 

Updated Date - 2021-10-15T00:42:12+05:30 IST