Americaలోని NRI భర్తకు ఏడాదిన్నరగా చుక్కలు చూపిస్తున్న భార్య.. షాకిచ్చిన భారత High Court

ABN , First Publish Date - 2021-09-02T22:54:44+05:30 IST

అనారోగ్యంతో ఉన్న బిడ్డకు చికిత్స చేయించాలని ఆ ఎన్నారై మహిళ భర్తకు చెప్పింది. అమెరికా నుంచి భారత్‌కు వచ్చేసింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగి రావాలని భర్త కోరుతున్నా..

Americaలోని NRI భర్తకు ఏడాదిన్నరగా చుక్కలు చూపిస్తున్న భార్య.. షాకిచ్చిన భారత High Court

చండీఘర్: అనారోగ్యంతో ఉన్న బిడ్డకు చికిత్స చేయించాలని ఆ ఎన్నారై మహిళ భర్తకు చెప్పింది. అమెరికా నుంచి భారత్‌కు వచ్చేసింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగి రావాలని భర్త కోరుతున్నా ఏవో సాకులు చెబుతూ ఇక్కడే ఉంది. ఏళ్లు గడుస్తున్నా భార్య, బిడ్డ తిరిగి రాకపోవడంతో సదరు ఎన్నారై భర్త కోర్టుకెక్కాడు. తనకు న్యాయం కావాలని కోరాడు. అమెరికాలోని స్థానిక కోర్టు అతడికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. అయితే భారత్‌లో ఉన్న అతడి భార్య మాత్రం అక్కడకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఈ కేసు పంజాబ్-హర్యానా కోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కూడా భర్తకు అనుకూలంగానే తీర్పు నిచ్చింది. బిడ్డను తీసుకుని వెంటనే సదరు ఎన్నారై మహిళ అమెరికా వెళ్లాలని సూచించింది. ఈ కేసుపై తదుపరి విచారణ, తీర్పు అమెరికా కోర్టు ఇస్తుందని తీర్పు వెల్లడించింది.


వివరాల్లోకి వెళితే.. ఇటీవల పంజాబ్-హర్యానా కోర్టులో ఓ ఎన్నారై తన బిడ్డ కోసం అప్పీల్ చేశాడు. అమెరికాలోని అర్కన్సాస్‌, బెంటన్ కౌంటీకి చెందిన సదరు ఎన్నారై.. బిడ్డకు వైద్యం చేయించాలని తన భార్య 2019లో భారత్ వచ్చిందని, కానీ ఇప్పటివరకు తిరిగి రాలేదని తన అప్పీల్‌లో పేర్కొన్నాడు. ఈ కేసుపై విచారించిన న్యాయస్థానం.. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బిడ్డను అమెరికా తీసుకెళ్లడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. అతడిని తీసుకుని వెంటనే సదరు మహిళ అమెరికా వెళ్లాలని తీర్పునిచ్చింది.


ఈ క్రమంలోనే తన బిడ్డకు ఇంకా భారత్‌లో చికిత్స అందించాల్సి ఉందని, ఇక్కడే మెరుగైన చికిత్స అందిచగలుగుతామని భార్య చెప్పిన విషయాలను కోర్టు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తన భర్త గృహహింసకు పాల్పడ్డాడని కూడా ఆమె కోర్టుకు తెలియజేసింది. ఈ ఆరోపణలను కూడా కోర్టు కొట్టిపారేసింది.


‘బిడ్డ భవిష్యత్తు కోసం ఏది మంచిదని భావిస్తున్నామో, అదే చెబుతున్నాం. అతడికి అనారోగ్యానికి అమెరికాలో కూడా చికిత్స అందించవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే బిడ్డతో పాటు తల్లి కూడా వెంటనే అమెరికాకు వెళ్లాలని తీర్పునిస్తున్నాం. దీనికి తోడు ఇప్పటికే అమెరికా కోర్టు భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. బిడ్డ భవిష్యత్తును గురించే ఈ తీర్పునిస్తున్నాం’ అని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Updated Date - 2021-09-02T22:54:44+05:30 IST