లాటరీ విధానంలోనే హెచ్-1బీ వీసాలు !
ABN , First Publish Date - 2021-02-06T13:01:33+05:30 IST
హెచ్-1బీ వీసా కేటాయింపులపై ఈ ఏడాది చివరి దాకా లాటరీ విధానం కొనసాగనుంది. జీతాలు, మెరిట్ ఆధారంగానే వీసా కేటాయింపులు ఉంటాయని, మార్చి 9 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని గతంలో ప్రకటించిన ట్రంప్ నిర్ణయాన్ని జో బైడెన్ ప్రభుత్వం వాయిదా వేసింది.

ట్రంప్ నిర్ణయాన్ని వాయిదా వేసిన బైడెన్ సర్కారు.. ప్రపంచంతో నడిచేందుకు ‘అమెరికా వచ్చేసింది’
చైనా దూకుడు, సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం: బైడెన్
వాషింగ్టన్, ఫిబ్రవరి 6: హెచ్-1బీ వీసా కేటాయింపులపై ఈ ఏడాది చివరి దాకా లాటరీ విధానం కొనసాగనుంది. జీతాలు, మెరిట్ ఆధారంగానే వీసా కేటాయింపులు ఉంటాయని, మార్చి 9 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని గతంలో ప్రకటించిన ట్రంప్ నిర్ణయాన్ని జో బైడెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. హెచ్-1బీ వీసాల పరంగా ట్రంప్ హయాంలో జరిగిన నిర్ణయాన్ని 2021 డిసెంబరు 31 దాకా వాయిదా వేస్తున్నట్లు అమెరికా సిటిజన్షి్ప, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం (యూఎ్ససీఐఎస్) తాజాగా ప్రకటించింది. మరోవైపు ట్రంప్ హయాంలో మిత్ర దేశాలతో దెబ్బతిన్న సంబంధాలకు మరమ్మతులు చేసి, ప్రపంచంతో కలిసి నడుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
బాధ్యతలు చేపట్టిన 15 రోజుల తర్వాత విదేశీ వ్యవహారాలపై తొలిసారిగా మాట్లాడిన బైడెన్, ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అంటూ ప్రపంచానికి సందేశాన్ని ఇస్తున్నానని ప్రకటించారు. ఉపాఽధ్యక్షురాలు కమాలా హారి్సతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రసంగంలో ఎక్కడా భారత్ పేరును ప్రస్తావించలేదు. విదేశీ వ్యవహారాల విషయంలో తమకు చైనాయే అతిపెద్ద సవాలు అని బైడెన్ పేర్కొన్నారు. చైనాను ‘గట్టి పోటీదారు’గా అభివర్ణించిన ఆయన, ఆ దేశం దూకుడును దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు.
అయితే, అమెరికా ప్రయోజనాల కోసం చైనాతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రష్యా విషయంలో ట్రంప్ సర్కారు తీరుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం, సైబర్ దాడుల వంటి దుందుడుకు చర్యలకు కాలంచెల్లిందని పుతిన్ను ఉద్దేశించి వ్యాఖ్యా రష్యా విపక్ష నేత అలెక్సీ నవల్నీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మయన్మార్లో సైన్యం వెంటనే దిగిపోవాలని స్పష్టం చేశారు.