యూఎస్‌సీఐఎస్‌పై హెచ్1బీ వ్యాజ్యం ఉపసంహరణ
ABN , First Publish Date - 2021-05-05T14:39:17+05:30 IST
అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎ్‌స)పై కోర్టులో తాము ఉమ్మడిగా దాఖలు చేసిన హెచ్1బీ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోనున్నట్టు ఏడు కంపెనీలు వెల్లడించాయి.

అమెరికా కంపెనీల నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎ్‌స)పై కోర్టులో తాము ఉమ్మడిగా దాఖలు చేసిన హెచ్1బీ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోనున్నట్టు ఏడు కంపెనీలు వెల్లడించాయి. విదేశీయులకు ఇచ్చే వర్క్‌వీసాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి, తగు న్యాయం చేస్తామని యూఎ్‌ససీఐఎస్ అంగీకరించిన నేపథ్యంలో ఆ కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబరు 1 తర్వాత దాఖలైన హెచ్1బీ పిటిషన్లను యూఎ్‌ససీఐఎస్ తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ఏడు కంపెనీల తరఫున అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ మార్చి నెలలో ఈ వ్యాజ్యాన్ని మసాచుసెట్స్ ఫెడరల్ డిస్ర్టిక్ట్ కోర్టులో దాఖలు చేసింది. యూఎ్‌ససీఐఎస్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని ఆ కంపెనీలు వాదించాయి. అయితే పొరపాట్లను సరిదిద్ది.. న్యాయం చేసేందుకు యూఎ్‌ససీఐఎస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నాయి.