ఎన్నారైలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-02-01T23:50:42+05:30 IST

ఈ రోజు పార్లమెంట్‌లో 2021-22కు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఎన్నారైలను ఉద్దేశించి కీలక ప్రకటనలు చేశారు. ఎన్నారైలకు డబుల్ ట్యాక్సేషన్‌ నుంచి ఊర

ఎన్నారైలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ: ఈ రోజు పార్లమెంట్‌లో 2021-22కు సంబంధించిన  బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఎన్నారైలను ఉద్దేశించి కీలక ప్రకటనలు చేశారు. ఎన్నారైలకు డబుల్ ట్యాక్సేషన్‌ నుంచి ఊరట కల్పిస్తున్నట్టు తెలిపారు. త్వరలో అందుకు సంబంధించిన నిబంధనలను తెలియజేయనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ట్యాక్స్ ఆడిట్ లిమిట్‌ను రూ.5 కోట్ల నుంచి రూ.10కోట్లకు పెంచనున్నట్టు వెల్లడించారు. 95శాతం డిజిటల్‌ విధానంలో లావాదేవీలు జరిపే వారికి ఇది వర్తించనుందని చెప్పారు. ఎన్నారైలు భారత్‌లో ఉండే గడువును 182రోజుల నుంచి 120 రోజులకు కుదించారు. 



ఎన్నారైల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. ప్రవాసులు వన్ పర్సన్ పంపెనీలను ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించనున్నట్టు చెప్పింది. అందుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాగా.. ఇండియాలో నివసిస్తున్న భారత పౌరులకు మాత్రమే వన్ పర్సన్ కంపెనీలు నెలకొల్పే అవకాశం ఉండేది. తాజాగా ఎన్నారైలు కూడా వన్ పర్సన్ కంపెనీలను నెలకొల్పే విధంగా నిబంధనలను సడలిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో స్టార్టప్‌లకు ఊతం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నారైలు పెద్ద సంఖ్యలో స్టార్టప్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. 


Updated Date - 2021-02-01T23:50:42+05:30 IST