ఎగిరేపళ్లాలు నిజమే.. ఫుటేజిలు ఉన్నాయన్న ఒబామా!

ABN , First Publish Date - 2021-05-21T05:11:56+05:30 IST

అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది లేట్ లేట్ షో విత్ జేమ్స్ కార్డన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా..

ఎగిరేపళ్లాలు నిజమే.. ఫుటేజిలు ఉన్నాయన్న ఒబామా!

వాషింగ్టన్: అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది లేట్ లేట్ షో విత్ జేమ్స్ కార్డన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా.. ఎగిరే పళ్లాలు (యూఎఫ్‌వో) గురించి షాకింగ్ విషయం వెల్లడించారు. ఈ యూఎఫ్‌వోలకు సంబంధించిన ఫుటేజీలు, రికార్డులు నిజంగానే ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ‘‘నేను ఇక్కడ నిజమే చెప్తున్నా. ఆకాశంలో ఎగిరే కొన్ని వస్తువులకు సంబంధించిన ఫుటేజీలు, రికార్డులు వాస్తవంగానే ఉన్నాయి. కానీ అవేంటో మనకు కచ్చితంగా తెలియదు’’ అని ఒబామా అన్నారు. ఆ ఎగిరే వస్తువులు ఏ శక్తితో ఎగురుతున్నాయో? ఎలా కదులుతున్నాయో? ఏ మార్గంలో వెళ్తున్నాయో కూడా మనం వివరించలేమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-05-21T05:11:56+05:30 IST