అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-24T15:58:46+05:30 IST

అమెరికాలోని ఒహాయా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. ఒహాయాలోని యాంగ్‌స్టౌన్‌లో టార్చ్‌ క్లబ్‌ బార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు.

అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి

ఒహాయో, మే 23: అమెరికాలోని ఒహాయా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. ఒహాయాలోని యాంగ్‌స్టౌన్‌లో టార్చ్‌ క్లబ్‌ బార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బార్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక తుపాకీతో దుండగులు కాల్పులు జరిపారని వివరించారు. మరోవైపు, శనివారం అర్ధరాత్రి దాటాక న్యూజెర్సీలోని సౌత్‌జెర్సీలో ఓ పార్టీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 12 మందికి గాయాలయ్యాయి. 


Updated Date - 2021-05-24T15:58:46+05:30 IST