ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2021-10-21T03:11:43+05:30 IST

ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దసరా పాటలతో, నృత్యాలతో ఏడు గంటల పాటు కార్యక్రమం కొనసాగింది. కరోనా కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలకు రెండేళ్లుగా దూరం ఉన్న తెలుగువారు దసరా, బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని ఫిన్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి తెలిపారు. సింగపురం వినయ్, అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి తదితరులు వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మను తయారు చేయించి, పిల్లలు, ఆడపంచులందరూ పాల్గొనేలా చేశారు. బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ సహకరించారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని రఘునాధ్ రెడ్డి చెప్పారు. ఫిన్లాండ్‌లో ఉన్న తెలుగు వారందరికీ అన్నివేళలా అండగా ఉంటామని సంస్థ ఉపాధ్యక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి, సత్యనారాయణ తెలిపారు. 

Updated Date - 2021-10-21T03:11:43+05:30 IST