టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని అమెరికా విస్తరిస్తోంది: ఆంథోనీ ఫౌచీ

ABN , First Publish Date - 2021-08-21T02:01:19+05:30 IST

ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకాలను విరాళంగా ఇవ్వడానికి అమెరికా కృషి చేస్తోందని అగ్రరాజ్య అధినేత జో బైడెన్ వైద్య సలహాదారుడు, ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఇం

టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని అమెరికా విస్తరిస్తోంది: ఆంథోనీ ఫౌచీ

వాషింగ్టన్: ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకాలను విరాళంగా  ఇవ్వడానికి అమెరికా కృషి చేస్తోందని అగ్రరాజ్య అధినేత జో బైడెన్ వైద్య సలహాదారుడు, ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఇందుకోసం టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తోందని వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాను డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికన్లకు బూస్టర్ డోసులను ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అయితే అమెరికా వంటి సంపన్న దేశాలు బూస్టర్ డోసులు ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని పేద దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి ఇంకా రాలేదు.. ఇటువంటి తరుణంలో సంపన్న దేశాలు బూస్టర్ డోసులు ఇచ్చేందుకు సిద్ధపడటం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంథోనీ ఫౌచీ స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మేము రెండూ చేస్తున్నాము’ అని పేర్కొన్నారు. అమెరికన్లకు బూస్టర్ డోసులు ఇస్తూనే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేయగలమని తాము నమ్ముతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని అమెరికా విస్తరిస్తోందని ఫౌచీ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-08-21T02:01:19+05:30 IST